Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

ధనస్సు
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం సర్వత్రా అనుకూలదాయకమే. కార్యసిద్ధి, ప్రశాంతత ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పరిచయస్తులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. అభివృద్ధిపథంలో ముందుకు సాగుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. చిరువ్యాపారులకు ఆశాజనకం.