Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

ధనస్సు
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వాయిదా పడిన పూర్తి చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం చదువులపై దృష్టి సారించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రేమ వ్యవహారాలు సమస్యాత్మకమవుతాయి.