Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

ధనస్సు
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఈ మాసం బాగుంటుంది. కార్యసిద్ధి, వ్యవహారజయం పొందుతారు. రావలసిన ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పత్రాలు అందుకుంటారు. గృహనిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. ప్రయాణం తలపెడతారు. 5, 6, 14, 19, 20, 24, 27, 29 తేదీలు అనుకూలం. 1, 3, 9, 11, 13, 17, 23, 25, 28 తేదీలు ప్రతికూలతలు అధికం.