Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

ధనస్సు
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడుతు వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు.