Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట ఈ మాసం అనుకూలదాయకం. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పత్రాలు సమయానికి అందుతాయి. కొత్త పనులు చేపడతారు. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొనుగోలుదార్లను ఓ కంట కనిపెట్టండి. ఉద్యోగస్తులు అధికారులకు సన్నిహితులవుతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.