Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ సంకల్పబలమే కార్యసిద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. స్థిరచరాస్తుల విషయంలో పునరాలోచన మంచిది. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.