Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల్లో సవరణలు అనివార్యం. ఆహ్వానం అందుకుంటారు. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు.