Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభాపాఠవాలు వెలుగుచూస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత ప్రధానం. పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పురస్కారయోగం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.