Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

తుల
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు యోగదాయకమైన కాలం సమీపిస్తోంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. మీదైన రంగంలో రాణిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. గృహమార్పు అనివార్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి ప్రయోజనం కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవదర్శనాలు కొత్త అనుభూతినిస్తాయి.