Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

తుల
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ప్రతికూలతలు అధికం. సంప్రదింపులు ఫలించవు. దృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. దంపతుల మధ్య తరచూకలహాలు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. వాహనదారులకు దూకుడు తగదు.