Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

తుల
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు ఈ మాసం అనుకూలదాయకం. లక్ష్మాన్ని సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు భారమనిపించవు. కొంత మొత్తం పొదుపు చేయగల్గుతారు. సంస్థల స్థాపనలకు తగిన సమయం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. విద్యార్థులకు సమయపాలన ప్రధానం.