Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

తుల
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిన పుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. అయిన వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 2, 6, 12, 16, 19, 20, 22, 27, 29 తేదీలలో అభివృద్ధి. 3, 7, 10, 13, 15, 17, 25, 26, 28 తేదీలలో జాగ్రత్త.