Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కన్య
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఈ మాసంలోను గ్రహాల స్థితి అనుకూలంగానే ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అందరితోను కలుపుగోలుగా మెలుగుతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. దుబారా ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు చేయాలన్న లక్ష్యం నెరవేరదు. ఆహ్వానాలు, పత్రాలు అందుకుంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. మీ ప్రమేయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 56, 14, 16, 20, 22, 24, 27, 29 తేదీలు ఆశాజనకం. 1, 4, 7, 9, 11, 13, 17, 23, 25, 26 తేదీలు అసంతృప్తికరం.