Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

సింహం
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి విషయంలో పట్టుదలకు పోవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయాన్ని ఉభయులూ పాటిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం. అధికారులకు కొత్త సమస్యలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు, వస్తువులు లభ్యమవుతాయి.