Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

సింహం
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం అనుకూలంగా ఉంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. మొండి బాకీలు వసూలవుతాయి, విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని కట్టడి చేయండి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపుల్లో మెళకువ వహించండి. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. అవివాహితులకు శుభయోగం. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. సేవ, దైవకార్యాలకు సాయం అందిస్తారు.