Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష గ్రహాల సంచారం నిదానంగా అనుకూలిస్తుంది. పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ప్రయోజనం కలిగిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త పనులు చేపడతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పొగడ్తలకు పొంగిపోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన ఫలితాలుంటాయి. నూతన వ్యాపారాలకు అనువైన సమయం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.