Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టి సారిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సంకల్ప బలం ముఖ్యమని తెలుసుకోండి. సమష్టి కృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.