Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతను చాటుకుంటారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఎవరినీ నొప్పించవద్దు. మీ కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు.