Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మిథునం
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు కార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం పొందుతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మీ సాయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 5, 6, 14, 19, 20, 24, 27 తేదీలలో పురోభివృద్ధి. 1, 4, 7, 10, 11, 15, 23, 26, 28 తేదీలు నిరాశాజనకం.