Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మిథునం
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టు విడుపు ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. అసాధ్యమనుకున్న పనులు తేలిగా పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.