Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఈ మాసం ప్రథమార్ధం యోగదాయకం. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. సముచిత ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూమవుతుంది. వాస్తుదోష నివాణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు పరీక్షలు సంతృప్తికరంగా రాయగల్గుతారు.