Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంకల్పం నెరవేరుతుంది. తలపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యవహార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం చదువులపై దృష్టి సారించండి. తరచు శుభకార్యాల్లో పాల్గొంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాల కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనదారులకు దూకుడు తగదు. 26, 12, 16, 19, 22, 27, 29 తేదీలు కలిసివస్తాయి. 1, 3, 9, 11, 13, 15, 17, 25, 28 తేదీలలో అసంతృప్తి.