Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. అనుకూలతలు అంతంతమాత్రమే. లావాదేవీలతో తీరిక ఉండదు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం. అయిన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆచితూచి అడుగేయాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. వేడుకకు హాజరవుతారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.