Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మేషం
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మనోబలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు అవసరమవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.