Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. మిత సంభాషణ శ్రేయస్కరం. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆత్మీయుల వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు.