Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు కార్యసాధనలో జయం, ధనలాభం ఉన్నాయి. మనోభీష్టం నెరవేరుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. రుణసమస్యలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితం సాధిస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అభ్యంతరాలు పట్టించుకోవద్దు. వ్యవహార ఒప్పందాల్లో పెద్దలు సహకరిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానానికి శుభయోగం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదామార్పు. ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది.