Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్నింటిలో అనుకూలత, మరి కొన్నింటిలో ప్రతికూలతలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించటానికి సందేహించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. అన్యమస్కంగా కాలం గడుపుతారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 26, 14, 16, 22, 24, 27 తేదీలలో అభివృద్ధి. 1, 7, 9, 11, 15, 17, 23, 26, 28 తేదీలలో శ్రమ అధికం.