Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు శుభసమయం నడుస్తోంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహనిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. వస్త్రలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు మానసికంగా స్థిమితపడతారు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆధ్మాత్మిక చింతన పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.