Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మేషం
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య తరుచు కలహాలు. మనస్థిమితం ఉండదు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. నిరుద్యోగులకు ఏకాగ్రత, పట్టుదల ప్రధానం. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రయాణం విరమించుకుంటారు. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోవద్దు.