Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మేషం
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వేడుకలను ఘనంగా చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువుల జాగ్రత్త. వ్యవహారాలను మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.