Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ప్రతికూలతలు అధికం. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. సంప్రదింపులు ముందుకు సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. యత్నాలు విరమించుకోవద్దు. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితులతో సంభాషణ ఊరట కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉన్నతాధికారులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. చేపట్టిన ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు.