Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. సమర్థతకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పదవులు అందుకుంటారు. బాధ్యతగా మెలగాలి. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవివాహితులకు శుభదాయకం. నూతన వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. ఉన్నతాధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు కష్టసమయం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది.