Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఆర్థికస్థితి సామాన్యం. ఖర్చులు అదుపులో ఉండవు. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. మనోబలంతో యత్నాలు సాగించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు అనివార్యం. అపరిచితులతో జాగ్రత్త. కొంతమంది మీ నుంచి విషయసేకరణకు యత్నిస్తారు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీకులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల్లో సవరణలను అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వైద్యపరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.