Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మేషం
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. అంచనాలు ఫలిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. గృహంలో నూతన వాతావరణం నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. సంతానం చదువులపై దృష్టి పెడతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వేడుకకు యత్నాలు సాగిస్తారు. బాధ్యతలు, పనులు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.