Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మకరం
మకర రాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని విధాల కలిసివచ్చే కాలం. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధు మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వాస్తుకు అనుగుణంగా గృహ మార్పు చేపడుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు సేవా సంస్థలకు సాయం అందిస్తారు. నగదు ఆభరణాలు జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణంలో ఇబ్బందులెదురవుతాయి.