Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-05-22 శుక్రవారం రాశిఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజిస్తే...

astro12
, శుక్రవారం, 6 మే 2022 (04:00 IST)
మేషం :- ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆత్మీయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. గృహోపకరణాలను అమర్చుకుంటారు. కుటుంబంలో శుభకార్యానికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, తిప్పట తప్పవు. దైవదర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు.
 
మిథునం :- విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమాంచాల్సి ఉంటుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖుల కలయిక మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
 
కర్కాటకం :- కోళ్ళ, మత్స, గొర్రె, పాడి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సహోద్యోగులతో సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
సింహం :- ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. మీ కళత్ర మొండి వైఖరి వల్ల ఇబ్బందులకు గురవుతారు. దైవ సేవా కార్యక్రమాలలోచురుకుగా పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహరాల్లో మెలకువ వహించండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
కన్య :- వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు.
 
తుల :- ఉద్యోగస్తులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. కోర్టు వ్యవహారాలు అనుకూలం. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించి అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- బంధువుల రాకతో కొంత అ సౌకర్యానికి గురవుతారు. ప్రయాణాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. భాగస్వామిక చర్చలు, ఆస్తి వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. మానసిక ప్రశాంతతకు పుస్తక పఠనం చాలా అవసరం. విద్యార్థులు బజారు తిను బండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
మకరం :- ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. లౌక్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి.
 
కుంభం :- కోళ్ళ, మత్స్య రంగాల్లో వారికి చికాకులు తప్పవు. కళత్ర మొండివైఖరి వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు అధికమవుతాయి. విద్యుత్, ఎ.సి., కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి లభిస్తుంది. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
మీనం :- ఎలక్ట్రికల్, ఎలక్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉమ్మడి ఆర్థిక లావాదేవీల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదిశంకరాచార్య జయంతి 2022 : కనకధారా స్తోత్రకర్త.. శివుడే కాలడి శంకరుడిగా..?