Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Today Daily Astro గురువారం రాశిఫలాలు - రుణ సమస్యలు తొలగుతాయి...

Astrology

రామన్

, గురువారం, 12 డిశెంబరు 2024 (04:00 IST)
Today Daily Astro మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఖర్చులు సామాన్యం. కొత్త పనులు చేపడతారు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్య తొలగుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యవహారాల్లో జాగ్రత్త. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు, అప్పగించవద్దు. తీర్థయాత్రకు సన్నాహాలు సాగిస్తారు. పత్రాలు అందుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్‌ప్రభావం చూపుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో వాగ్వాదాలకు దిగవద్దు. దంపతల మధ్య సఖ్యత లోపం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అపరిచితులతో జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. బంధువులతో సంభాషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ప్రయాణం వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదాపడతాయి. పెద్దలతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పులు సాధ్యమవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. యత్నాలు కొనసాగించండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. కీలక వ్యవహారాలతో తలమునకలవుతారు. పట్టుదలకు పోవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. విందులు, వేడుకకు హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నోటీసులు అందుకుంటారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుషభవజ్ఞుల సలహా పాటించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ఆలయాలు, సేవాసంస్థలకు విరాళాలు అందిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Virgo Prediction 2025 : కన్యారాశికి 2025వ సంవత్సరం ఎలా వుంటుంది?