Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకు కొత్తగా పెళ్ళయ్యిందా.. గర్భం రాలేదా.. అయితే ఇవే సమస్యలు..?

Advertiesment
Health
, బుధవారం, 1 జనవరి 2020 (15:07 IST)
సంతానం కలగకపోవడానికి సెక్స్ లో పాల్గొంటే సరిపోదంటున్నారు వైద్యులు. అండం విడుదల సమయంలో సెక్స్ లో పాల్గొనడం అవసరమంటున్నారు. స్త్రీకి నెలలో ఒకేసారే అండం విడుదల అవుతుందట. అలా విడుదలైన అండానికి వీర్యకణంతో కలయిక చెంది పిండంగా మారే పరిస్థితి ఒక్కరోజు మాత్రమే ఉంటుందట. కొందరు పురుషులు వృత్తిరీత్యానో, వ్యాపార రీత్యానో తరచు టూర్ లో ఉంటారు. అందువల్ల సెక్స్ లో రెగ్యులర్ గా పాల్గొనడం జరగదు.
 
వీరు ప్రతినెల అండం విడుదల సమయంలో సెక్స్ లో పాల్గొనడం మిస్ అవుతుంటారు. అలా మిస్ అవ్వడం వల్ల ఎన్ని సంవత్సరాలైనా గర్భం రాదట. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసేవారైతే చెరొక ఊరిలో ఉంటే దాంపత్యంలో పాల్గొనడమే అపురూపం అయిపోతుంది. అటువంటప్పుడు స్త్రీ గర్భం దాల్చడం ఉండదు.
 
కొందరు దంపతులైతే రోజూ సెక్స్ లో పాల్గొంటూనే ఉంటారు. ఒక్కసారే కాదు రెండు, మూడుసార్లు పాల్గొంటారు. గర్భం రాదు. ఇటువంటి వాళ్ళలో కొందరు స్త్రీలకి పి.సి.ఒ.ఎస్,. ఉండొచ్చట. దాని వల్ల అండం విడుదల ఉండదట. మరికొందరిలో అయితే అన్నీ బాగానే ఉంటాయి. కానీ గర్భాశయం దిగువ బాగంలో వీర్యకణాలు ప్రయాణించడానికి అవసరమైన స్వరిక్స్ లోని మార్గం చాలా సన్నగా ఉంటుందట.  అంటే సూది పడేటట్లు ఉంటుందట.
 
అన్నీ బాగానే ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు దంపతులిద్దరూ అన్నీ బాగానే ఉన్నప్పటికీ యోని మార్గం నుంచి గర్భాశయంలోకి వీర్యకణాలు చేరవలసిన మార్గం చాలా సన్నగా ఉండడంతో గర్భం దాల్చడం కుదరట. సాధారణంగా నెలనెలా బహిష్టు అయ్యే స్త్రీలలో బహిష్టు స్రావం కనబడిన 10వరోజు నుంచి 18వరోజు వరకు గర్భం వచ్చే దినాలు. గర్భం కావాలనుకున్నప్పుడు తక్కిన దినాల్లో పాల్గొన్నా, పాల్గొనలేకపోయినా ఈ కాలంలో తప్పకుండా పాల్గొనాలట. బహిష్టు స్రావం కనబడిన 10వరోజు నుంచి 18వరోజు వరకు రోజూ సెక్స్ లో పాల్గొనకపోయినప్పటికీ కనీసం రోజు విడిచి రోజు అయినా సెక్స్ లో పాల్గొనాలట. 
 
ఒకసారి విడుదలైన అండానికి కలయిక చెందే శక్తి 24గంటలే ఉన్నా వీర్యకణాలకి రెండు, మూడు రోజులు అండంతో కలయిక చెందే శక్తి ఉంటుందట. ఒక్కసారి స్కలింపబడిన వీర్యకణాలు మూడు రోజుల పాటు యోనిలో యాక్టివ్ గానే ఉంటాయట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఒక్కకాయ... మీ ఒంట్లో వేడి అలా తగ్గిపోతుంది...?