Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఒక్కకాయ... మీ ఒంట్లో వేడి అలా తగ్గిపోతుంది...?

Advertiesment
ఆ ఒక్కకాయ... మీ ఒంట్లో వేడి అలా తగ్గిపోతుంది...?
, బుధవారం, 1 జనవరి 2020 (14:56 IST)
ఏకాకంలోనైనా దొరికేవి నిమ్మకాయలు. అయితే వేసవి కాలంలో అయితే ఇవి మరింతగా వస్తాయి. వీటి వాడకం కూడా ఆ కాలంలోనే ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుత చలికాలంలో కూడా నిమ్మకాయను ఆహారాపదార్థాల్లో వాడితే ఎంతో మంచిదట. వీటిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందట. 
 
ప్రతిరోజూ పొద్దునే పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుడు నీళ్ళలో కలుపుకుని కొంచెం తేనె వేసుకుని తాగితే అధిక బరువు తగ్గుతారట. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటారని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నిమ్మకాయ వల్ల నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి. 
 
రోజూ నిమ్మకాయ తినడం వల్ల శరీరంలో ఉండే అధిక వేడి తగ్గుతుందట. పల్చగా వేసిన మజ్జిగలో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగితే ఒంట్లో వేడి పూర్తిగా తగ్గిపోతుందట.
 
నిమ్మకాయలు అధికంగా దొరికే కాలంలో పది నిమ్మకాయలను రసం పిండి దాంట్లో వందగ్రాముల అల్లం చిన్న చిన్న ముక్కులుగా చేసి వేయాలట. అలాగే సరిపడినంత ఉప్పు, జీలకర్ర కూడా నిమ్మరసంలో కలపాలట. వాటిని మూడురోజుల పాటు అలాగే ఉంచిన తరువాత రసంతో పాటే అల్లం ముక్కలను ఎండబెట్టాలట. 
 
వీటిని ఒక సీసాలో వేసుకుని నోరు వికారంగా ఉన్నప్పుడు ఒక అల్లం ముక్కను నోట్లో వేసకుంటే వికారం తగ్గిపోతుందట. నిమ్మకాయలు అధికంగా దొరికే రోజుల్లో నిమ్మరసంతో షర్బత్ తయారుచేసుకుని నిల్వ చేసుకోవాలట. ఒక గ్లాసుడు నిమ్మకాయల రసానికి రెండు గ్లాసుల పంచదార తీసుకోవాలట. 
 
పంచదారలో గ్లాసుడు నీళ్ళు పోసి లేత పాకం పెట్టాలట. పాకం చల్లారాక నిమ్మరం కొంచెం ప్రిజిర్వేటివ్ లెమన్ ఎసెన్సు వేసి బాగా కలపాలట. ఆ తరువాత వడకట్టి సీసాలో పోసుకుంటే షర్బత్ రెడీ అవుతుందట. ఇలా నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నారా? బాదం పప్పుల్ని?