Publish Date: Tue, 31 Dec 2019 (22:01 IST)
Updated Date: Tue, 31 Dec 2019 (22:02 IST)
చిన్నచిన్న సమస్యలను అధిగమించేందుకు వంటింట్లోని దినుసులను ఉపయోగిస్తే సరిపోతుంది.
1. అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి.
2. కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది.
3. బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠిపొడి, నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి.. పాలు పడతాయి.
4. అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దను శొంఠిపొడి, నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది.
5. బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేసెతో తీసుకోవాలి.
6. కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠిపొడిని వేసి తీసుకోవాలి.
7. నెలసరి సమస్యలున్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి.