ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నారా? బాదం పప్పుల్ని?

బుధవారం, 1 జనవరి 2020 (14:03 IST)
పొట్టలో నొప్పి, ఊపిరి సరిగా తీసుకోలేకపోతున్నా, ఆహారం సరిగా జీర్ణం కావట్లేదని అనిపించినా బాదం పప్పుల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. శ్వాస సమస్యలతో ఇబ్బందిపడేవారు రోజూ 10 నుంచి పదహేను బాదం పప్పుల్ని తీసుకోవాలి. 
 
ఆరోగ్యంగా వున్నవారు మాత్రం రోజుకు ఐదు బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతల వంటివి వస్తుంటే రోజూ ఐదేసి బాదం పప్పుల్ని తీసుకోవాల్సి వుంటుంది. 
 
ఎందుకంటే... వాటిలోని మాంగనీస్... కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. బాదంలలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమికొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది. 
 
అలా జరిగినప్పుడు గుండెకు మేలు జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలోంచి తరిమికొట్టాలంటే.. రోజుకు పది బాదం పప్పుల్ని తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా.. . ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా వుంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శీతాకాలంలో పసుపును ఇలా వాడితే.. నెలసరి సమయంలో?