Publish Date: Thu, 09 Sep 2021 (21:56 IST)
Updated Date: Thu, 09 Sep 2021 (22:00 IST)
నల్ల బియ్యంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీనితో బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేట్లు చూసుకుంటుంది ఇలా బరువు తగ్గడానికి నల్ల బియ్యం సహాయం చేస్తుంది. నల్ల బియ్యం తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండడంతో కాన్స్టిట్యూషన్ వంటి సమస్యలు ఉండవు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు కూడా రాకుండా ఇది చూసుకుంటుంది. ఇలా జీర్ణ సమస్యలను పోగొడుతుంది నల్లబియ్యం . ఆస్తమా ఉన్నవాళ్లు నల్ల బియ్యం తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల బియ్యం తీసుకోవడం వల్ల క్రమంగా ఆస్తమా తగ్గుతుంది
ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల అరగడానికి ఎక్కువ సేపు సమయం పడుతుంది అలాగే షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉండేటట్టు చూసుకుంటుంది. ఇన్సులిన్ లెవల్స్ పెరగకుండా నల్ల బియ్యం ఉపయోగపడుతుంది. ఇలా నల్ల బియ్యంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.