Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

పైథానీ చీరల అద్భుతాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఓన్లీ పైథానీ

Advertiesment
OnlyPaithani
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (20:25 IST)
అధీకృత చేనేత పైథానీ చీరలకు సుప్రసిద్ధమైన ఆన్‌లైన్‌ బ్రాండ్‌ ఓన్లీ పైథానీ, ఇప్పుడు తమ నూతన మరియు ప్రత్యేకమైన పైథానీ, చేనేత ఎథ్నిక్‌ వేర్‌ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా ముత్యాల నగరి, హైదరాబాద్‌లో తమ ఉనికికి చాటడానికి సర్వం సిద్ధం చేసింది.
 
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్నటువంటి ఓన్లీ పైథానీ స్టోర్‌లో అత్యద్భుతమైన శ్రేణి మరియు ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన పైథానీ చీరలతో పాటుగా ఇతర ఎథ్నిక్‌ వేర్‌ అయినటువంటి రెడీ-టు-వేర్‌ జాకెట్లు, ఆహ్లాదకరమైన కుర్తీలు, లోపాలు ఎంచలేనట్టి డిజైన్డ్‌ దుపట్టాలు అందుబాటులో ఉంటాయి.
 
సహజసిద్ధమైన, స్వచ్ఛమైన వస్త్రాలతో తీర్చిదిద్దిన ఓన్లీ పైథానీ కలెక్షన్‌ రంగు రంగుల యోలా పైథానీ చీరల యొక్క మహోన్నతమైన రంగులను ప్రదర్శిస్తుంది. అదే సమయంలో ఇవి అసమానమైన ఆకర్షణను వెంట తీసుకోవడంతో పాటుగా అత్యున్నత పనితనాన్నీ ప్రదర్శిస్తాయి.
 
ఓన్లీ పైథానీ- సిల్క్‌, బంగారంలో...
సిల్క్స్‌కు మహారాణి (క్వీన్‌ ఆఫ్‌ సిల్క్స్‌)గా ఖ్యాతి గడించిన పైథానీ, ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క వినూత్నత పరంగా సుప్రసిద్ధమైనది. కుటుంబ వారసత్వపు ఆస్తిగా ఇవి గుర్తింపు పొందడం మాత్రమే కాదు మహారాష్ట్రియన్‌ వధువు వస్త్రాలలో ప్రత్యేక స్ధానమూ సంపాదించుకున్నాయి. అతి సున్నితమైన సిల్క్‌  బేస్‌, మెరుపులు వెదజల్లే జరీ అంచులు మరియు ధాటియైన మోటిఫ్స్‌ కలిగి ఉండటంతో పాటుగా సిల్క్‌లో బంగారంలా అందమైన కవిత్వంను ప్రదర్శిస్తుంది.
 
2010లో కార్యకలాపాలు ఆరంభించిన తరువాత తమ మూడవ స్టోర్‌ను ప్రారంభిస్తున్న ఓన్లీ పైథానీ, మహోన్నతమైన పైథానీ  చేనేత సంప్రదాయాన్ని పునరుద్ధరించడంతో పాటుగా స్థానిక,  చిన్న గ్రామాలలోని చేనేత కళాకారులకు తగిన సాధికారిత అందించాలని  ప్రయత్నిస్తుంది. నేడు ఈ బ్రాండ్‌ 25 మందికి పైగా చేనేత కారులతో కలిసి పనిచేయడంతో పాటుగా ఆధీకృత పైథానీ చీరలను డిజైన్‌ చేయడం, నేయడం మరియు ఉత్పత్తి చేయడం చేస్తుంది. ఇక్కడ ప్రతి చీర, కళాత్మకతకు ప్రతీకగా నిలువడమే కాదు, మహారాష్ట్రలోని పైథానీ  చేనేత కళాకారుల నైపుణ్యం, చాతుర్యతనూ ప్రదర్శిస్తుంది.
 
పైథానీ చీరలు, ప్రేమతో రూపుదిద్దుకున్నవి...
క్లాసిక్‌ మరియు విలాసవంతమైన చీరలు మొదలు అద్భుతమైన షో స్టాపర్స్‌ వరకూ, స్టేట్‌మెంట్‌ పీసెస్‌ను ఓన్లీ పైథానీ అందిస్తుంది. ఫ్యాషన్‌లను అభిమానించే తల్లుల అభిరుచులకు తగినట్లుగా ఉంటూనే వినూత్న ధోరణులను అభిమానించే యువతను సైతం ఆకట్టుకునే రీతిలో ఇవి ఉంటాయి. మీ కలల పైథానీని సృష్టించుకునేందుకు సహాయపడుతూ కస్టమైజేషన్స్‌ను సైతం ఈ స్టోర్‌ అందిస్తుంది.
 
ఓన్లీ పైథానీ యొక్క నూతన స్టోర్‌ ప్రారంభోత్సవంలో  భాగంగా ప్రత్యేకంగా లిమిటెడ్‌ ఎడిషన్‌ కలెక్షన్‌ సైతం విడుదల చేశారు. బ్రాండ్‌ యొక్క హైదరాబాద్‌ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా ప్రత్యేకంగా ఈ కలెక్షన్‌ తీర్చిదిద్దారు. ఈ కలెక్షన్‌లో ఎక్స్‌క్లూజివ్‌, సుసంపన్నమైన చీరలు, శక్తివంతమైన రంగులు, అతి సున్నితమైన జరీ వర్క్‌, విస్మయపరిచే మోటిఫ్స్‌ ఉంటాయి. మహోన్నతమైన పైథానీ వారసత్వంకు నివాళులర్పిస్తూ డిజైన్‌ చేసిన ప్రతి చీరనూ ఎనిమిది నెలల పాటు ప్రేమ, అంకిత భావం చూపుతూ తీర్చిదిద్దారు.
 
భారతదేశపు వైవిధ్యమైన కళలు, టెక్స్‌టైల్‌ సంప్రదాయాలను వేడుక చేస్తూ, ఓన్లీ పైథానీ  ఆకర్షణీయమైన శ్రేణి చేనేత చీరలను సైతం ప్రదర్శిస్తుంది. వీటిలో జమ్దానీ మరియు దేశవ్యాప్తంగా అంతగా ప్రాచుర్యం పొందని చేనేత కళారూపాలు , తమ సోదర బ్రాండ్‌ హ్యాండ్లూమ్‌ స్టూడియో నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఇతర వస్త్రాలను సైతం ప్రదర్శిస్తుంది.
 
ఒకవేళ మీరు ఆపాత మధురాలను నూతన తరపు డిజైన్లలో చూడాలనుకుంటే, మీరు తప్పనిసరిగా సందర్శించాల్సిన ఒకే ఒక్క ప్రాంతం ఓన్లీ పైథానీ. మీరు ఓన్లీ పైథానీ యొక్క నూతన స్టోర్‌ను షాప్‌ నెంబర్‌ 4, లుంబినీ అమృత చాంబర్స్‌, బంజారాహిల్స్‌, రోడ్‌ నెంబర్‌ 3, చట్నీస్‌ పక్కన, వీఎస్‌టీ కాలనీ, పంజాగుట్ట, హైదరాబాద్‌, తెలంగాణా- 500082 వద్ద సందర్శించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోటి దుర్వాసన నివారణకు సరైన మార్గం, ఏం చేయాలంటే?