Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాగ్యనగరిలో కుండపోత : ఎన్నడూ లేనంత వర్షపాతం

Advertiesment
భాగ్యనగరిలో కుండపోత : ఎన్నడూ లేనంత వర్షపాతం
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (15:18 IST)
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో గత కొన్ని రోజులుగా హైద‌రాబాద్ వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ మూడు నెల‌ల కాలంలో హైద‌రాబాద్‌లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే 24 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. జూన్ 1 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు 24 శాతం అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మారేడుప‌ల్లిలో అత్య‌ధికంగా 46 శాతం అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది.
 
అంటే, ఒక్క మారేడుప‌ల్లిలోనే అత్య‌ధికంగా 745.6 మి.మీ. వ‌ర్ష‌పాతం. సాధార‌ణ వ‌ర్ష‌పాతం 509.4 మి.మీ. దీనికి కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్‌, అమీర్‌పేట‌, షేక్‌పేట‌, ఆసిఫ్‌న‌గ‌ర్‌, తిరుమ‌ల‌గిరి ఏరియాల్లో 30 నుంచి 40 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైంది.
 
ఇకపోతే, సైదాబాద్‌లో 654.4 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం 463.1 మి.మీ.), ఆసిఫ్‌న‌గ‌ర్‌లో 621 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం 463.1 మి.మీ.), అమీర్‌పేట‌లో 677.1 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం 509.1 మి.మీ.), తిరుమ‌ల‌గిరిలో 677.6 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం 509.1 మి.మీ.), షేక్‌పేటలో 609.8 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం 463.1 మి.మీ.), ముషీరాబాద్‌లో 666.1 మి.మీ. (సాధార‌ణ వ‌ర్ష‌పాతం 510.3 మి.మీ.) వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో రెండు రోజుల్లో పెళ్లి - అంతలోనే టీచరమ్మ ఆత్మహత్య