''పారద'' వినాయకుని పూజిస్తే...

పాదరసంతో తయారుచేసిన వినాయకుని పారద గణపతి అంటారు. పాదరసంతో తయారుచేసిన శివలింగాలను మాత్రం ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ పారద శివలింగాలను పూజించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలానే పాదరసంతో చేసిన వినాయకు

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (11:02 IST)
పాదరసంతో తయారుచేసిన వినాయకుని పారద గణపతి అంటారు. పాదరసంతో తయారుచేసిన శివలింగాలను మాత్రం ఎక్కువగా పూజిస్తుంటారు. ఈ పారద శివలింగాలను పూజించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలానే పాదరసంతో చేసిన వినాయకుని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది. జ్ఞానవృద్ధి, మనోధైర్యం కోసం పారద గణపతి పూజిస్తే మంచిది.
 
వినాయక చవితి రోజున పూజమందిరంలో బొటనవేలి పరిమాణంలో ఉండే పారద గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తే మంచిది. పాదరసంతో లక్ష్మీదేవితో కలిసి ఉన్న గణపతి రూపాన్ని ఆరాధిస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార సంస్థల్లో ముఖ్యంగా పారద లక్ష్మీగణపతిని పూజించడం వలన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయని చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 10-09-2018 సోమవారం దినఫలాలు - మీ పనుల సానుకూలతలకు...