ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పాలతో అభిషేకాలు చేస్తే...?

జీవితంలో దారిద్ర్యం చాలా దుఃఖాన్ని, భయాన్ని కలుగజేస్తుంటాయి. దారిద్ర్యం అనేక రకాల అవమానాలు ఎదురయ్యేలా చేయడమే కాకుండా అందరి నుండి దూరం చేస్తుంది. అలాంటి దారిద్ర్య బాధలు ఎలాంటి పరిస్థితుల్లోను కలుగకూడదన

శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:24 IST)
జీవితంలో దారిద్ర్యం చాలా దుఃఖాన్ని, భయాన్ని కలుగజేస్తుంటాయి. దారిద్ర్యం అనేక రకాల అవమానాలు ఎదురయ్యేలా చేయడమేకాకుండా అందరినీ దూరం చేస్తుంది. అలాంటి దారిద్ర్య బాధలు ఎలాంటి పరిస్థితుల్లోను కలుగకూడదనే అందరు కోరుకుంటారు. దారిద్ర్యం తొలగిపోయి సిరిసంపదలతో కూడిన ఆనందకరమైన జీవితం లభించాలంటే లక్ష్మీదేవిని పూజించాలి.
 
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమెకు ఇష్టమైన ధర్మమార్గాన్ని అనుసరించాలి. తోటివారి పట్ల, సమస్త జీవుల పట్ల దయ కలిగుండాలి. ముఖ్యంగా ఇంటిని పూజ మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పాలతో అభిషేకించి గులాబి పువ్వులతో పూజించాలి. నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. తద్వారా అమ్మవారి అనుగ్రహం తప్పక దొరుకుతుంది.    

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శుక్రవారం (07-09-2018) దినఫలాలు - ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా...