ఇంట్లో వాస్తు ఎనర్జీ సరిగ్గా వుండాలి. అలా కాకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. వాస్తు చాలా శక్తి వంతమైంది. ఎందుకంటే సూర్యుడి నుంచి సోలార్, చంద్రుడి నుంచి ల్యూనార్, ఎర్త్ నుంచి మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్ ఎనర్జీని, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకే వుంది. అందుకే వాస్తు దేవుడు ఫోటో ఇంట్లో వుండాలి. వాస్తు దేవుడి ఫోటోను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. సుఖ సంతో షాలతో వుంటారు.
లక్ష్మీ కటాక్షం కోసం ఇంట లక్ష్మీ పూజ చేయాలి. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తూ.. డబ్బును శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి. ఇంట్లో చీకటి వుండకూడదు. రాత్రిపూట కూడా చిన్న బల్బు అయినా వెలుగుతూ వుండాలి. చీకటి ఒత్తిడికి కారణం అవుతుంది.
* ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉత్తరం వైపు పెట్టకూడదు.
* ఇంటితో పాటు వ్యాపార స్థలంలో ఈశాన్య మూలలు అందంగా వుంచాలి.
* మెట్ల కింద చెప్పులు, మాప్స్, షూస్ వుండకూడదు. ఇలా చేస్తే పేదరికం ఏర్పడుతుంది.
* ఇంటితో పాటు వ్యాపారంలో క్యాష్ లాకర్ ఉత్తరం వైపు వుండాలి.
* ఇంటి ప్రధాన ద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోను అతికించాలి. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు స్థిరంగా వుంటుంది.
* ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంట నైరుతి దిశగా పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ విగ్రహాన్ని నమస్కరిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.