Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Master Leaked, విజయ్ మాస్టర్ ఫిల్మ్‌ లీక్, షాక్‌ తిన్న చిత్ర యూనిట్

Advertiesment
Master Leaked, విజయ్ మాస్టర్ ఫిల్మ్‌ లీక్, షాక్‌ తిన్న చిత్ర యూనిట్
, సోమవారం, 11 జనవరి 2021 (23:49 IST)
విజయ్, సేతుపతి నటించిన మాస్టర్ చిత్రం లీకైంది. దీంతో చిత్ర యూనిట్ షాక్ తిన్నది. ఈ చిత్రంలో విజయ్ సరసన మాల్వికా మోహనన్ నటించారు. అనిరుధ్ కంపోజ్ చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.
 
ఈ చిత్రం జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుండటంతో, ఈ చిత్రం ప్రమోషన్ జోరందుకుంది. ఈ మాస్టర్ చిత్రం 13న కేరళలో, జనవరి 14న తమిళనాడుతో సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడుతుంది. ఈ పరిస్థితిలో, ఈ రోజు చిత్ర బృందం మాస్టర్ మూవీ యొక్క యాక్షన్ సన్నివేశాలతో 5వ ప్రోమోను విడుదల చేసింది.
 
కానీ చిత్ర బృందానికి షాక్ ఇచ్చే విధంగా, మాస్టర్ ఫిల్మ్‌లో కనిపించిన ఓపెనింగ్ సీన్‌తో సహా సుమారు 1 గంట ఫుటేజ్ ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. దీనితో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన ట్విట్టర్ పేజీలో... ఏడాదిన్నర పోరాటాల తర్వాత మాస్టర్ ఫిల్మ్ తెరపైకి వస్తోంది. మీరంతా సినిమా థియేటర్‌లో చూడండి. సినిమాకు సంబంధించి లీక్ నుండి ఏదైనా బయటకు వస్తే దాన్ని షేర్ చేయవద్దంటూ విన్నవించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుఎన్‌ అకాడమీతో చేతులు కలిపిన భారతదేశపు సుప్రసిద్ధ గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌