Publish Date: Tue, 23 Mar 2021 (22:56 IST)
Updated Date: Tue, 23 Mar 2021 (22:58 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి హుండీకే కన్నం వేయాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు. పక్కా ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలోని హుండీలో ఓ యువకుడు చోరీకి ప్రయత్నించాడు. నిందితుడు హుండీలోని రూ. 30 వేలు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.
ఇంతలో విజిలెన్స్ అధికారులు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం సీసీటీవీ కెమెరాల ద్వారా అతడి చోరీ బండారాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు.
సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా, శ్రీవారి ఆలయ హుండీలోనే చోరీకి ప్రయత్నించడం తిరుమలలో తీవ్ర చర్చనీయాంశమైంది.