కింగ్ కోబ్రాను ముంగిస చావకొట్టింది. ఎప్పుడూ కోబ్రాలకు, ముంగిసలకు పడనంటే పడదు. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ప్రధానమైంది కింగ్ కోబ్రా. మనిషిని చూడగానే పడగవిప్పి కాటేసేందుకు సిద్ధమవుతుంది. అందుకే ఇదంటే చాలా మందికి భయం. పేరుకు ముందు కింగ్ ఉందంటనే అది పాముల్లో ఎంత ప్రమాదకారో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఈ పాము కూడా ఒక జీవిని చూసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే ముంగిస. అలా ఈ రెండింటి మధ్య తాజాగా ఓ వార్ జరిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. చెట్టు కొమ్మపై కింగ్ కోబ్రా ఉంది. ఇంతలో అక్కడకు వచ్చిన ముంగిసను చూసి పారిపోయేందుకు ప్రయత్నించింది.
దీంతో ముంగిస ఒక్కసారిగా పైకి దూకి పాము మెడ అందుకుంది. దీంతో పాము తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది. అయినా ఫలితం లేకపోయింది. పామును చంపిన ముంగిస పొదల్లోకి తీసుకుపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.